(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నా మదిలో భావాలు ఉప్పెనలా పొంగినపుడు, వెలువడే భాషే నా కవిత
నా మది గాయపడినపుడు, ఆ బాధకు ప్రతిబింబం నా కవిత
నా మదిని సంతోషం కౌగిలించుకునపుడు, ఆ అంతులేని ఆనందానికి చిహ్నం నా కవిత
నా మది నిరాశతో నిండినపుడు, చనిపోయిన నా ఆశలకు కొత్త రెక్కలను సృష్టించేది నా కవిత
నా మది కష్టాల వలలో చిక్కుకున్నపుడు, నా తోడు నిలిచే స్నేహం నా కవిత
నా మది కలతనే నిప్పులలో రగిలినపుడు, చల్లని ఓదార్పునిచేది నా కవిత
నా మది అంధకారంలో కమ్ముకున్నపుడు, వెలుగుతో దారి చూపే దీపం నా కవిత
నా మది అలసిపోయినపుడు, చక్కని జోలపాట పాడే అమ్మ నా కవిత
నా మదిలో నిండిన నిర్జీవమైన ఊహలకు , ఊపిరి పోసేది నా కవిత
నా మదిని ఒంటరితనం దహించివేసినప్పుడు , నాతో నడిచే వెన్నలంటి చల్లని నీడ నా కవిత
అటు ఇటు తిరిగే తోచని నా మదికి, ఆహ్లాదాన్ని పంచే ఆట నా కవిత
నా పెదవులు పలకలేని భావాలను, లోకానికి తెలిపే అందమైన దారి నా కవిత