24 August 2011

ప్రకృతి అందం

0 వ్యాఖ్యలు ♥ ツ


ఒంటరి చంద్రుడి చుట్టూరా చుక్కలు ఎంత అందం
నల్లని రాత్రి చీకటికి జాబిల్లి ఎంత అందం
వికసించే పువ్వు పైన చినుకు ముత్యం ఎంత అందం
ఆకాశాన హరివిల్లుకి రంగులు ఎంత అందం 


రంగులతో నిండిన సీతకోకచిలకకి ఎగిరే స్వేఛ్చ ఎంత అందం
వాన చినుకులు మోసే మేఘాలకి విహరించే నైజం ఎంత అందం
వాన పలకరింపుకి స్పందించే మయూరి నాట్యం ఎంత అందం
గ్రీష్మఋతువు పలకరింపుకి, తుళ్ళి పాడే నల్ల కోకిల గానం ఎంత అందం


16 August 2011

మిల మిలలా మిణుగురులే--తకిట తకిట ~నాకు నచ్చిన పాట

2 వ్యాఖ్యలు ♥ ツ


మిల మిలలా మిణుగురులే,
తళతళ తారల్లా మారినవే,
మది నదిలో అలజడులే,
ఇప్పుడిక మాయం అయ్యేనులే...(2)

ఎన్నో ఎన్నో ఆశలు ఇన్నాళ్ళుగా
చెప్పే వీలే లేక వేచాయిగా
నాలో దాగే మౌనం నేడో రేపో
మాటై పోదా తొలిగా

నీకై నా హృదయం
వేచే ప్రతి నిమిషం
తియ్యని బాధే అయినా ఆనందంగా ఉంటుందే
రోజు తోలి ఉదయం
నిన్నే నా నయనం
చూడాలంటూ ఎంతో ఎంతో ఆరాటంగా కలగంటోందే
నీకిక అన్ని నేనే
నీలో వెచ్చని స్వాసై
కలిసుంటాగా కడదాక
కనుమూసే దాక

నాకోసం నేనెపుడు ఆలోచించి ఎరుగానులే
తరచు నీ ఊహలలో విహరిస్తున్నాలే
నీతో ఈ సంగతులు చెప్పాలనిపిస్తుంటొందే
తరుణం ఇది కాదంటూ
వద్దోద్దంటూ మనసే ఆపిందే ...



మిల మిలలా మిణుగురులే,
తళతళ తారల్లా మారినవే,
మది నదిలో అలజడులే,
ఇప్పుడిక మాయం అయ్యేనులే

12 August 2011

కవిత అంటే.............??

2 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 

చాల మంది దృష్టిలో కవిత అంటే
చెత్త కాగితాల పై పిచ్చి రాతలు
కాని నా దృష్టిలో కవిత అంటే....
అక్షరాలు అనే ముత్యాలని,
భావం అనే దారాలతో అల్లి,
కవిత అనే అందమైన  హారాన్ని చేసి
,
మన సాహిత్య కళామ్మ తల్లికి సమర్పించడం


నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి