23 January 2012

నీ చిత్రానికి నా భావం

8 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

తెల్ల పువ్వు:
అందరిలో విశేషంగా కనిపిస్తున్నానని ఆనందపడనా?
లేక, ఒంటరిగా మిగిలానని బాధపడనా?

13 January 2012

సహజత్వం

9 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

రెక్కలను గాయపరుస్తూ, బలవంతంగా మొగ్గని పువ్వు చేస్తీ...
ఉండునా ఆ పువ్వుకి సహజమైన అందం ?
"నన్ను ప్రేమించు!!" అని నేను అర్ధిస్తే, జాలితో నువ్వు నన్ను ప్రేమిస్తే

నిలుచునా కలకాలం అలా ఏర్పడిన మన ప్రేమ బంధం ?

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి