(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
ఎగరాలని ప్రయత్నిస్తున్న రంగుల చిట్టి చిలకని
బంగారు పంజరంలో నిర్భందించావు
దాని ఆకలి తీర్చావు, దాహం తీర్చావు
కాని, అది కొరుకుంటున్న స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు
పాపం చిట్టి చిలక...అది ఉన్న పరిధిలోనే ఎగురుతూ...
తనకు స్వేచ్ఛ వచ్చేది ఎప్పుడా అని తెగ ఆరాటపడేది
కొన్నాళ్ళు గడిచింది...
చిట్టి చిలక అందం క్షీణించింది
రంగులతో నిండిన చిలుక, రంగులు లేకుండా పోయింది
ఇప్పుడు, ఆ చిలక నీకు భారం అయిపోయింది...
చివరికి...దాన్ని వదిలేసావ్...
కాని ఎం లాభం??...
ఇప్పుడు అది రెక్కలున్నా ఎగరలేదు
కోరుకున్న స్వేచ్ఛ దరిచేరినా ....అనుభవించలేదు!!