skip to main |
skip to sidebar
తేది సమయం
5/29/2011 10:37:00 PM
స్త్రీ జీవితం దీపం లాంటిది తాను ఆరిపోయేలోపు ,
తన కన్నీటిని ఇంధనం చేసి తన వాళ్ళ చీకటి జీవితాలలో వెలుగు నింపుతుంది
తేది సమయం
5/25/2011 11:39:00 AM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
వెలుగుని చూపించే నిజమనే స్వేఛ్చ కన్నా
చీకటితో కమ్ముకుపోయిన అబద్దమనే నిర్భంధనమే నాకు నచ్చింది
ఎందుకంటే...
నేను ఆ అబద్డంలోనే నిజాన్ని చూసాను, చీకటిలో వెలుగుని చూసాను, బాధలోనే హాయిని ఆస్వాదించాను
తేది సమయం
5/18/2011 10:32:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నిజమనే అలలకు ఎదురు ఈదలేక
అబద్దమనే వలలో చిక్కుకున్నా!!
తేది సమయం
12/21/2010 10:31:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నా మదిలో భావాలు ఉప్పెనలా పొంగినపుడు, వెలువడే భాషే నా కవిత
నా మది గాయపడినపుడు, ఆ బాధకు ప్రతిబింబం నా కవిత
నా మదిని సంతోషం కౌగిలించుకునపుడు, ఆ అంతులేని ఆనందానికి చిహ్నం నా కవిత
నా మది నిరాశతో నిండినపుడు, చనిపోయిన నా ఆశలకు కొత్త రెక్కలను సృష్టించేది నా కవిత
నా మది కష్టాల వలలో చిక్కుకున్నపుడు, నా తోడు నిలిచే స్నేహం నా కవిత
నా మది కలతనే నిప్పులలో రగిలినపుడు, చల్లని ఓదార్పునిచేది నా కవిత
నా మది అంధకారంలో కమ్ముకున్నపుడు, వెలుగుతో దారి చూపే దీపం నా కవిత
నా మది అలసిపోయినపుడు, చక్కని జోలపాట పాడే అమ్మ నా కవిత
నా మదిలో నిండిన నిర్జీవమైన ఊహలకు , ఊపిరి పోసేది నా కవిత
నా మదిని ఒంటరితనం దహించివేసినప్పుడు , నాతో నడిచే వెన్నలంటి చల్లని నీడ నా కవిత
అటు ఇటు తిరిగే తోచని నా మదికి, ఆహ్లాదాన్ని పంచే ఆట నా కవిత
నా పెదవులు పలకలేని భావాలను, లోకానికి తెలిపే అందమైన దారి నా కవిత
తేది సమయం
9/28/2010 09:06:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
స్నేహం మరపురాని అనుబంధం
ప్రేమానురాగాల నిలయం
కోయిల పాట మాధుర్యం
ఉదయించు సూర్య కిరణం
ఇంద్రధన్నస్సుతో ప్రకాశించే గగనం
మదిని పులకించు సంగీతం
ప్రేమ చినుకుతో కురిసే అమృత వర్షం
తామరాకు పై నీటి ముత్యం
మనస్సు తో పలికే భావం
వికసించు పువ్వు పరిమళం
కళ్ళను మిరుమిట్లుగొలిపే స్వప్నం
పరవళ్ళు తొక్కే సముద్ర తీరం
పూరి విప్పిన నెమలి నాట్యం
నమ్మకమనే ముత్యాలతో నిండిన హారం
చిగురించు ఆకు పచ్చదనం
సీతకోకచిలక రెక్కల సౌందర్యం
మనస్సుని పరవశించే రాగం
పున్నమి చంద్రుడి వెన్నెల చల్లదనం
కోటి వెలుగులతో ప్రకాశించే నక్షత్రం
స్నేహం తోడులో కలుగును విజయం
చెలిమి చెట్టు నీడలో తొలగును దుఃఖం
స్నేహం దేవుడు మనకు ఇచిన గొప్ప వరం
ఈ అమూల్యమైన వరాన్ని చేజర్చుకోకు నేస్తం
దీనిని పదిలంగా ఉంచుకో కలకాలం