skip to main |
skip to sidebar
తేది సమయం
12/21/2010 10:31:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నా మదిలో భావాలు ఉప్పెనలా పొంగినపుడు, వెలువడే భాషే నా కవిత
నా మది గాయపడినపుడు, ఆ బాధకు ప్రతిబింబం నా కవిత
నా మదిని సంతోషం కౌగిలించుకునపుడు, ఆ అంతులేని ఆనందానికి చిహ్నం నా కవిత
నా మది నిరాశతో నిండినపుడు, చనిపోయిన నా ఆశలకు కొత్త రెక్కలను సృష్టించేది నా కవిత
నా మది కష్టాల వలలో చిక్కుకున్నపుడు, నా తోడు నిలిచే స్నేహం నా కవిత
నా మది కలతనే నిప్పులలో రగిలినపుడు, చల్లని ఓదార్పునిచేది నా కవిత
నా మది అంధకారంలో కమ్ముకున్నపుడు, వెలుగుతో దారి చూపే దీపం నా కవిత
నా మది అలసిపోయినపుడు, చక్కని జోలపాట పాడే అమ్మ నా కవిత
నా మదిలో నిండిన నిర్జీవమైన ఊహలకు , ఊపిరి పోసేది నా కవిత
నా మదిని ఒంటరితనం దహించివేసినప్పుడు , నాతో నడిచే వెన్నలంటి చల్లని నీడ నా కవిత
అటు ఇటు తిరిగే తోచని నా మదికి, ఆహ్లాదాన్ని పంచే ఆట నా కవిత
నా పెదవులు పలకలేని భావాలను, లోకానికి తెలిపే అందమైన దారి నా కవిత
తేది సమయం
9/28/2010 09:06:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
స్నేహం మరపురాని అనుబంధం
ప్రేమానురాగాల నిలయం
కోయిల పాట మాధుర్యం
ఉదయించు సూర్య కిరణం
ఇంద్రధన్నస్సుతో ప్రకాశించే గగనం
మదిని పులకించు సంగీతం
ప్రేమ చినుకుతో కురిసే అమృత వర్షం
తామరాకు పై నీటి ముత్యం
మనస్సు తో పలికే భావం
వికసించు పువ్వు పరిమళం
కళ్ళను మిరుమిట్లుగొలిపే స్వప్నం
పరవళ్ళు తొక్కే సముద్ర తీరం
పూరి విప్పిన నెమలి నాట్యం
నమ్మకమనే ముత్యాలతో నిండిన హారం
చిగురించు ఆకు పచ్చదనం
సీతకోకచిలక రెక్కల సౌందర్యం
మనస్సుని పరవశించే రాగం
పున్నమి చంద్రుడి వెన్నెల చల్లదనం
కోటి వెలుగులతో ప్రకాశించే నక్షత్రం
స్నేహం తోడులో కలుగును విజయం
చెలిమి చెట్టు నీడలో తొలగును దుఃఖం
స్నేహం దేవుడు మనకు ఇచిన గొప్ప వరం
ఈ అమూల్యమైన వరాన్ని చేజర్చుకోకు నేస్తం
దీనిని పదిలంగా ఉంచుకో కలకాలం
తేది సమయం
6/28/2010 09:13:00 AM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
పరిమళం లేని పుష్పం ఎందుకు?
ఎండిపోయిన వృక్షం ఎందుకు?
పూలు లేని తోట ఎందుకు?
రాజు లేని కోట ఎందుకు?
మెరుపుని కోల్పోయిన తార ఎందుకు?
తీగలు తెగిపోయిన సితార ఎందుకు?
పడవలు లేని చెరువు ఎందుకు?
సంస్కారం లేని చదువు ఎందుకు?
గమ్యం లేని ప్రయాణం ఎందుకు?
చేజారిపోయిన సమయం ఎందుకు?
భావం లేని పద్యం ఎందుకు?
పగిలిపోయిన అద్దం ఎందుకు?
సాహిత్యం లేని భాష ఎందుకు?
దుఃఖానికి దారి తీసే దురాశ ఎందుకు?
ఆత్మీయత లేని కౌగిలి ఎందుకు?
వెన్నెల కురిపివ్వని జాబిల్లి ఎందుకు?
బాణం లేని విల్లు ఎందుకు?
రంగులు లేని హరివిల్లు ఎందుకు?
పట్టించుకోని కన్నీరు ఎందుకు?
బాధలో ఓదార్పు ఇవ్వని చెలిమి ఎందుకు?
చుక్కలు లేని ఆకాశం ఎందుకు?
దిక్కులు లేని భూమి ఎందుకు?
మనశాంతి ఇవ్వని సిరులు ఎందుకు?
వెలుగుని కప్పివేసే ఇరులు ఎందుకు?
భావన లేని చిత్రం ఎందుకు?
ఆశ్చర్యం లేని విచిత్రం ఎందుకు?
వర్షించని మేఘం ఎందుకు?
సముద్రంలో కురిసేటి వాన చినుకులు ఎందుకు?
స్ఫూర్తి ఇవ్వని స్వప్నం ఎందుకు?
మాధుర్యం లేని సంగీతం ఎందుకు?
చేపలు లేని నది ఎందుకు?
అస్వచ్ఛమైన మది ఎందుకు?
చూపు లేని నయనం ఎందుకు?
నటించే వినయం ఎందుకు?
ఎన్నటికి తీరలేని పగటి కల ఎందుకు?
నైపుణ్యం లేని కళ ఎందుకు?
స్పందన ఇవ్వలేని స్పర్శ ఎందుకు?
అభినందనం లేని హర్షమెందుకు?
ఇతరులకు మేలు చేయని చేదు నిజం ఎందుకు?
నమ్మకాన్ని గాయ పరిచే తీపి అబద్ధం ఎందుకు?
పగలు మెరిసే మిణుగురు పురుగులు ఎందుకు?
రేయిలో కూసే కోయిల కుతలేందుకు?
మనసును గాయం చేసే మాట ఎందుకు?
చెవులు ఉన్న వినలేని వాని ఎదుట పాట ఎందుకు?
మనసుకు లేని అందం దేహానికి ఉన్నను ఎందుకు?
ఇతరులను బాధ పెట్టె స్వార్ధపు ఆనందం ఎందుకు?
ఏమి సాధించి పెట్టలేని ఘర్షణ ఎందుకు?
తప్పు దోవ పట్టించే ఆకర్షణ ఎందుకు?
ప్రేమించని మనసు ఎందుకు?
ప్రేమకై వేచి చూసే మనిషికి ఎడబాటు ఎందుకు?
తేది సమయం
6/16/2010 09:13:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
జ్ఞాపకాలు మనసు అనే పుస్తకంలో పదిలంగా రాసుకున్న అనుభవాలు
మదిలో విహరించే గడిచిన ఊహాచిత్రాలు
మనకు దేవుడు ఇచిన గొప్ప వరాలు
కొన్ని అనుభవాలు తియ్యగా....హాయిగా
కొన్ని అనుభవాలు చేదుగా....బాధగా
కొన్ని ఒక అందమైన స్వప్నం లా......
కొన్ని కంట తడి పెట్టిస్తాయి...
కొన్ని చిరునవ్వుని కురిపిస్తాయి...
కొన్ని మనసారా హత్తుకుంటాయి ...
కొన్ని కోపంతో చీదరించుకుంటాయి...
ఎడబాటులో మన తోడు నిలిచే నేస్తాలు జ్ఞాపకాలు
జీవితంలో ముందుకు సాగేందుకు స్ఫూర్తిని నింపేది జ్ఞాపకాలు
నిరాశతో నిండినపుడు కొత్త ఆశలను చిగురింపచేసేది జ్ఞాపకాలు
విధి విపరీతానికి బలి అయిన మనిషికి చివరికి మిగిలిన ఆస్తి జ్ఞాపకాలు