(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
పరిమళం లేని పుష్పం ఎందుకు?
ఎండిపోయిన వృక్షం ఎందుకు?
పూలు లేని తోట ఎందుకు?
రాజు లేని కోట ఎందుకు?
మెరుపుని కోల్పోయిన తార ఎందుకు?
తీగలు తెగిపోయిన సితార ఎందుకు?
పడవలు లేని చెరువు ఎందుకు?
సంస్కారం లేని చదువు ఎందుకు?
గమ్యం లేని ప్రయాణం ఎందుకు?
చేజారిపోయిన సమయం ఎందుకు?
భావం లేని పద్యం ఎందుకు?
పగిలిపోయిన అద్దం ఎందుకు?
సాహిత్యం లేని భాష ఎందుకు?
దుఃఖానికి దారి తీసే దురాశ ఎందుకు?
ఆత్మీయత లేని కౌగిలి ఎందుకు?
వెన్నెల కురిపివ్వని జాబిల్లి ఎందుకు?
బాణం లేని విల్లు ఎందుకు?
రంగులు లేని హరివిల్లు ఎందుకు?
పట్టించుకోని కన్నీరు ఎందుకు?
బాధలో ఓదార్పు ఇవ్వని చెలిమి ఎందుకు?
చుక్కలు లేని ఆకాశం ఎందుకు?
దిక్కులు లేని భూమి ఎందుకు?
మనశాంతి ఇవ్వని సిరులు ఎందుకు?
వెలుగుని కప్పివేసే ఇరులు ఎందుకు?
భావన లేని చిత్రం ఎందుకు?
ఆశ్చర్యం లేని విచిత్రం ఎందుకు?
వర్షించని మేఘం ఎందుకు?
సముద్రంలో కురిసేటి వాన చినుకులు ఎందుకు?
స్ఫూర్తి ఇవ్వని స్వప్నం ఎందుకు?
మాధుర్యం లేని సంగీతం ఎందుకు?
చేపలు లేని నది ఎందుకు?
అస్వచ్ఛమైన మది ఎందుకు?
చూపు లేని నయనం ఎందుకు?
నటించే వినయం ఎందుకు?
ఎన్నటికి తీరలేని పగటి కల ఎందుకు?
నైపుణ్యం లేని కళ ఎందుకు?
స్పందన ఇవ్వలేని స్పర్శ ఎందుకు?
అభినందనం లేని హర్షమెందుకు?
ఇతరులకు మేలు చేయని చేదు నిజం ఎందుకు?
నమ్మకాన్ని గాయ పరిచే తీపి అబద్ధం ఎందుకు?
పగలు మెరిసే మిణుగురు పురుగులు ఎందుకు?
రేయిలో కూసే కోయిల కుతలేందుకు?
మనసును గాయం చేసే మాట ఎందుకు?
చెవులు ఉన్న వినలేని వాని ఎదుట పాట ఎందుకు?
మనసుకు లేని అందం దేహానికి ఉన్నను ఎందుకు?
ఇతరులను బాధ పెట్టె స్వార్ధపు ఆనందం ఎందుకు?
ఏమి సాధించి పెట్టలేని ఘర్షణ ఎందుకు?
తప్పు దోవ పట్టించే ఆకర్షణ ఎందుకు?
ప్రేమించని మనసు ఎందుకు?
ప్రేమకై వేచి చూసే మనిషికి ఎడబాటు ఎందుకు?