04 December 2011

నీడ

16 వ్యాఖ్యలు ♥ ツ




జీవంలేని ప్రతిబింబాన్ని
హద్దులెరుగని ఆకారాన్ని
నన్ను పట్టి బంధించలేవు
నన్ను తాకి స్పందించలేవు
చీకటిలో నీతో ఐక్యమైపోతాను
వెలుగులో నీ నుండి విడిపోతాను
పసి పాప కన్నులకి ఓ హాస్యాన్ని, ఓ ఆశ్చర్యాన్ని,
అంతుచిక్కని రహస్యాన్ని
పెద్దలకు సమయ సూచకాన్ని
అర్ధం కాని ఓ భావాన్ని
నీ నిలువెత్తు రూపాన్ని....నీ నీడని!!

నా నీడ ఫోటోలు బావున్నాయా?

02 December 2011

పక్షుల ఆవేదన

2 వ్యాఖ్యలు ♥ ツ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నా స్వేచ్ఛని ముక్కలు చేసాక , నా రెక్కలకి అర్ధం ఉందా?


(చిత్రాలని ఇక్కడ నుండి సేకరించాను)
నా ఈకల అందం, నాకు అయ్యేనే శాపం

29 November 2011

మనసుకి కళ్ళు ఉంటే...

7 వ్యాఖ్యలు ♥ ツ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 
ఆకాశాన చంద్రుడి అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, చంద్రుడి చుట్టూ ఉండి, దాని అందాన్ని మెరుగుపరిచే కోటి చుక్కలని పట్టించుకోము
వికసించిన గులాబీ పువ్వు అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, ఆ పువ్వుని కాపాడే ముళ్ళని పట్టించుకోము
ఆకాశాన్ని ఏడు రంగులతో కప్పే ఇంద్రధనస్సు చూసి మైమరచిపోతాము
కాని, ఆ అందానికి కారణమైన ఎండా, వానల కలయికన్న విషయాన్నీ పట్టించుకోము
వాన చినుకులని దోసిలిలో నింపుకుని, పైకి ఎగరేస్తూ, వాటితో ఆడుకుంటూ మైమరచిపోతాము
కాని, ఆ చినుకులని మొస్తూ కుడా హాయిగా, స్వేచ్చగా విహరించే మబ్బులను పట్టించుకోము
ఎక్కడినుంచో ఎగిరి వచ్చి చెట్టుపై వాలిన నెమలి అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, దానికి చల్లని నిడనిచ్చే చెట్టుని పట్టించుకోము
రంగుల రెక్కలతో ఎగిరే సీతకోకచిలక అందాన్ని చూసి మైమరచిపోతము
కాని తన ఈ కొత్త రూపం, గొంగళి పడిన కృషికి నిదర్శనము అన్న విషయాన్ని పట్టించుకోము
ప్రకృతిలో ప్రతి అందాన్ని చూసి మైమరచిపోతము
కాని, ఆ అందానికి కారణమైన మరో అందాన్ని మాత్రం మరచిపోతాము
ప్రతి సాధారణమైన విషయంలో, ఓ అద్భుతం దాగి ఉంది
సౌందర్యం కళ్ళని ఆకర్షిస్తుంది, కాని, ఆత్మసౌందర్యం మనసుని ఆకర్షిస్తుంది!
ఈ విశాల ప్రపంచాన్ని కళ్ళతోనే కాకుండా మనసుతో కూడా పరిశీలించు నేస్తం!!

19 November 2011

నువ్వు ఎరుగని మరో 'నేను'

2 వ్యాఖ్యలు ♥ ツ



నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా,
నా కళ్ళలో కన్నీళ్ళను, చిరునవ్వుతో కప్పివేసానని
స్పందించలేని కఠిన రాతి హృదయం నాదని అనుకున్నావా??

17 November 2011

రోజులో, రెండు గంటలు అధికంగా ఉంటే, ఆ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు?

3 వ్యాఖ్యలు ♥ ツ

 
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

 రోజులో, రెండు గంటలు అధికంగా ఉంటే
నాకు అది ఆనందాల పంటే
మా తమ్ముడిని కాసేపు ప్రేమగా ఏడిపిస్తా..
ఇంట్లో మొక్కలకు సేవ చేస్తా, అవి ఎదుగుతున్నపుడు చూసి ఆనందిస్తా
కార్టూన్లు చూస్తూ, ఐస్-క్రీం తింటా
ఓ కునుకు తీసి, అందమైన కల కంటా
రంగులతో ఆడుతూ అందమైన బొమ్మలు గీస్తా
కుళ్ళు జోకులు వేసి అందరిని ముర్చిల్లెట్టు చేస్తా
ప్రకృతిని అందాన్ని ఆస్వాదిస్తా
దాని అందాలన్నీనా కెమెరా బంధిస్తా
కాగితంపై పిచ్చి రాతలు రాసి, దాన్ని కవితగా మార్చేస్తా
సంగీతాన్ని వింటూ, పాడుతూ ఆడుతూ మైమరిచిపోతా
మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేస్తా
ఇంటర్నెట్లో కాలక్షేపం చేస్తా
మనసులో ఏది దాచుకోకుండా నా భావాలను తెలిపెస్తా
తనివితీరా నవ్వుతా
రోజు ఉండే పనుల నుండి విముక్తి పొందుతా
చివరికి, ఆ భగవంతుడిని ప్రార్థిస్తా
ప్రతి రోజు రెండు గంటలు అధికంగా ఇవ్వమని!!

ఈ కవిత సర్ఫ్ఎక్సెల్ మాటిక్ గెట్ స్మార్ట్ పోటికి వ్రాయబడినది
English version: here





12 November 2011

అమ్మా!! నీకు నేను భారమా??

7 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

అమ్మా!!
నీకు నేను భారమా??
ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా ?
చెత్తకుండియే నాకు స్థానమా?
పేదింటి తల్లి "నిన్ను పోషించలేమమ్మ!!" అని వదిలేస్తుంది
మధ్యతరగతింటి తల్లి "నువ్వు ఓ ఇంటి దానివయ్యాక, మమ్మల్ని ఎవరు చూస్తారమ్మ!!" అని వదిలేస్తుంది
గొప్పింటి తల్లి "మాకు వంశోద్ధారకుడు కావాలమ్మ!!" అని వదిలేస్తుంది
అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం అంటారు కదమ్మా !!
ఎక్కడ ఉందమ్మా సమానత్వం?
ఓ నాటి ఆడపిల్లకే, ఆడపిల్ల అంటే ఇంత చీదరింపు ఎందుకమ్మా ??
మంచికి, చెడుకి తేడా తెలియని ఈ లేత మనసుకి,
నీ కఠిన హృదయం చవి చూపించావా?
కళ్ళే తెరువని ఈ పసి పాప భవిష్యత్తుకి
కన్నీరే మిగిల్చావా?
నవమాసాలు మోసి,
నా దేహానికి ప్రాణం పొసి,
నీలోనే నన్ను వెలికి తీసి,
చివరికి, నన్ను  వదిలేసి,
'అమ్మ' అనే పదానికి అర్ధం లేకుండా ఎందుకు చేశావమ్మ??

17 October 2011

నన్ను నేను తిరిగి పొందేది ఎలా??!!

7 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నీ ప్రేమతో నా మనసుని ఆక్రమించుకున్నావు
నిన్న 'నేను' అనే నా చిన్న ప్రపంచం,
నీ రాకతో నేడు, 'నువ్వు'గా మారిపోయింది
కాని, ఈ సంతోషం కలకాలం నిలువలేదు
నీ ప్రేమ అబద్ధం అని తెలుసుకున్నాను
ఇప్పుడు, 'నువ్వు' అనే మాయా ప్రపంచం కాలంతో కరిగిపోయింది
చివరికి, నా ప్రపంచం నిర్మానుష్యమైన ఎడారిగా మారిపోయింది
తిరిగి 'నేను' అనే నా అందమైన ప్రపంచానికి నేను చేరువయ్యేదేలా??!!! :'(

02 October 2011

నా ఆవేదన!!

8 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను) Edited by: Sanchari
 
అందమైన కలలు కనమని
కళ్ళకు ఎందుకు చెప్పావు...
కన్నీరుగా కరిగించడానికా ?

ఆశల వలలు విసరమని
గుండెకు ఎందుకు చెప్పావు...
అడియాసలను బంధించడానికా?

చిరునవ్వుతో చెలిమి చేయమని
పెదవులకు ఎందుకు చెప్పావు...
ఆది ఒంటరి చేసినపుడు, వెల వెలబోతు ముడుచుకొడానికా?

లోతుగా ప్రేమించమని
హృదయానికి ఎందుకు చెప్పావు...
తరువాత తనని తానూ బాధతో చీల్చుకోడానికా ?

భగవంతుడా!! అసలు మనిషికి మనసుని ఎందుకు ఇచ్చావు?
మనసుని బొమ్మగా చేసి,
మనిషిని ఆడించడానికా?

26 September 2011

కొన్ని అందమైన కలలు నెరవేరడం అసాధ్యం!!.... కాని....

5 వ్యాఖ్యలు ♥ ツ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 

తారలను నా దోసిలిలో నింపుకోలేను!!
కాని,
తళ తళలాడే దాని మెరుపుని నా కళ్ళలో బంధించాను

ఎంత ఎగిరినా మేఘాలను తాకలేను!!
కానీ,
అవి చల్లగా కరిగినపుడు, కురిసిన వాన చినుకులని ఆస్వాదించాను

హరివిల్లు నుండి జివ్వున జారలేను !!
కాని,
దాని రంగులు నా కలలకు అద్దాను

సీతాకోకచిలకలా స్వేచ్చగా ఎగరలేను!!
కాని,
దాని రెక్కలు నా ఊహలకు ఇచ్చాను

దూరంగా ఉన్న నిన్ను చేరలేను!!
కాని,
పదిలపరుచుకున్ననీ జ్ఞాపకాలతో, నిన్ను నాకు చేరువగా చేసుకున్నాను


24 September 2011

నింగిలో తారలా~అలలు

4 వ్యాఖ్యలు ♥ ツ



నింగిలో తారలా, నవ్వితే నేనలా
వాలదా వెన్నెలా, చేరదా నన్నిలా
నేరుగా నువ్వలా, చూడు ఓసారిలా

నన్ను నేనే అలా, మరచిపోయేంతలా 

కన్నులా నిన్నిలా, దాచి ఉంచే కల
నన్నిలా జల్లులా, తడిపేనే హయిలా
కన్నులా నిన్నిలా, దాచి ఉంచే కల
చేరదా నన్నిలా, ప్రేమలా

నా గుండె మీద వాలి
చూపించు కాస్త జాలి
కనికరించవే.....మరి!!..

నా మనసు నిన్ను అల్లి
నువ్వెళ్ళు దారిమళ్లి
చేరుకుంది నీ కౌగిలి ...

అందమైన కూనలమ్మని
అందుకోవ చిన్ని గుండెని?
గుండెలోన ఉంది నీవని
అందుకో ప్రేమని ...

నాలోన నేను లేను, నీలోన చేరినాను
నమ్మవే ఎలా మరీ!!
నీ నీడలాగ నేను, నీ వెంట తోడుగాను
అడుగులేయనా మరీ!!

నింగిలోన జాబిలమ్మని

నేలమీద తేనెగువ్వని
పాడుతున్న కోకిలమ్మని
అందుకో ప్రేమని

నింగిలో తారలా, నవ్వితే నేనలా
వాలదా వెన్నెలా, చేరదా నన్నిలా
నేరుగా నువ్వలా, చూడు ఓసారిలా
నన్ను నేనే అలా, మరచిపోయేంతలా

కన్నులా నిన్నిలా, దాచి ఉంచే కల
నన్నిలా జల్లులా, తడిపేనే హయిలా
కన్నులా నిన్నిలా, దాచి ఉంచే కల
చేరదా నన్నిలా, ప్రేమలా


11 September 2011

చేరువగా ఉన్న మనుషులు, కానీ దూరమైన మనసులు

4 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

"నేనే నెగ్గాలి!!" అనే పంతం
ఇక ఉండునా కలహానికి అంతం?

మొన్న 'మనం' అనే మహా సముద్రం
నేడు, 'నువ్వు' 'నేను'  అనే నదులుగా విడిపోయేనా?
మొన్న 'భాష' వేరైనా, భావం ఒక్కటే

నేడు, భాష ఒక్కటైనా అర్ధాలు అనేకం
చివరికి,
కాలంతో పాటు మారిపోయిన అర్ధాలు, మిగిలిపోయిన జ్ఞాపకాలు
చేరువగా ఉన్న మనుషులు, కానీ దూరమైన మనసులు

09 September 2011

నా బొమ్మల ప్రపంచం

4 వ్యాఖ్యలు ♥ ツ





చిన్నప్పటినుంచి, బొమ్మలు వేయడం నాకు మంచి కాలక్షేపం.
ఎలా ఉన్నాయో చూసి, కాస్త మీ అభిప్రాయలు తెలుపగలరు

నా బొమ్మల బ్లాగు

న్యూయార్క్ నగరం~నువ్వు నేను ప్రేమ

0 వ్యాఖ్యలు ♥ ツ




న్యూయార్క్ నగరం నిదరోయవేళ, నేనే ఒంటరి
చలివో తుంటరి, తెప్పలు విడిచినా, గాలులు
తీరం వెతగగా, నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెల, తరిమే క్షణములో..
ఉరిమే వలపులో

న్యూయార్క్ నగరం నిదరోయవేళ, నేనే ఒంటరి
చలివో తుంటరి, తెప్పలు విడిచినా, గాలులు
తీరం వెతగగా, నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెల, తరిమే క్షణములో,తరిమే క్షణములో....
ఉరిమే వలపులో....

మాటలతో జోలాలి పాడినా కుయ్యాన పట్టలేవాయే,
దినము ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీ నువ్వు తేవాయే,
వింత వింతగ నలక తీసె నాలుకల నువ్వు రావాయే,
మనసులో వున్న కలవరం తీర్చె నువ్విక్కడ లేవాయే,
నేనిచట నీవు అచట ఈ
తపనలో క్షణములు యుగములైన వేళ,
నింగిచట నీలమచట ఇరువురికీ ఇది ఒక మధుర బాధయేగా ..


న్యూయార్క్ నగరం నిదరోయవేళ, నేనే ఒంటరి
చలివో తుంటరి....

తెలిసి తెలియక నూరు సార్లు ప్రతి రోజు నిను తలచు ప్రేమా,
తెల్సుకో మరి చీమలోచ్చాయి నీ పేరులో వుంది తెనేనా,
ఝూ అంటూ భూమి ఏదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మ,
నా జంటే నీవు వస్తే సంగ్రనమున అగ్గి మంట మంచు రూపమే ...

న్యూయార్క్ నగరం నిదరోయవేళ, నేనే ఒంటరి
చలివో తుంటరి, తెప్పలు విడిచినా, గాలులు
తీరం వెతగగా, నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెల, తరిమే క్షణములో,తరిమే క్షణములో....
ఉరిమే వలపులో....

24 August 2011

ప్రకృతి అందం

0 వ్యాఖ్యలు ♥ ツ


ఒంటరి చంద్రుడి చుట్టూరా చుక్కలు ఎంత అందం
నల్లని రాత్రి చీకటికి జాబిల్లి ఎంత అందం
వికసించే పువ్వు పైన చినుకు ముత్యం ఎంత అందం
ఆకాశాన హరివిల్లుకి రంగులు ఎంత అందం 


రంగులతో నిండిన సీతకోకచిలకకి ఎగిరే స్వేఛ్చ ఎంత అందం
వాన చినుకులు మోసే మేఘాలకి విహరించే నైజం ఎంత అందం
వాన పలకరింపుకి స్పందించే మయూరి నాట్యం ఎంత అందం
గ్రీష్మఋతువు పలకరింపుకి, తుళ్ళి పాడే నల్ల కోకిల గానం ఎంత అందం


16 August 2011

మిల మిలలా మిణుగురులే--తకిట తకిట ~నాకు నచ్చిన పాట

2 వ్యాఖ్యలు ♥ ツ


మిల మిలలా మిణుగురులే,
తళతళ తారల్లా మారినవే,
మది నదిలో అలజడులే,
ఇప్పుడిక మాయం అయ్యేనులే...(2)

ఎన్నో ఎన్నో ఆశలు ఇన్నాళ్ళుగా
చెప్పే వీలే లేక వేచాయిగా
నాలో దాగే మౌనం నేడో రేపో
మాటై పోదా తొలిగా

నీకై నా హృదయం
వేచే ప్రతి నిమిషం
తియ్యని బాధే అయినా ఆనందంగా ఉంటుందే
రోజు తోలి ఉదయం
నిన్నే నా నయనం
చూడాలంటూ ఎంతో ఎంతో ఆరాటంగా కలగంటోందే
నీకిక అన్ని నేనే
నీలో వెచ్చని స్వాసై
కలిసుంటాగా కడదాక
కనుమూసే దాక

నాకోసం నేనెపుడు ఆలోచించి ఎరుగానులే
తరచు నీ ఊహలలో విహరిస్తున్నాలే
నీతో ఈ సంగతులు చెప్పాలనిపిస్తుంటొందే
తరుణం ఇది కాదంటూ
వద్దోద్దంటూ మనసే ఆపిందే ...



మిల మిలలా మిణుగురులే,
తళతళ తారల్లా మారినవే,
మది నదిలో అలజడులే,
ఇప్పుడిక మాయం అయ్యేనులే

12 August 2011

కవిత అంటే.............??

2 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 

చాల మంది దృష్టిలో కవిత అంటే
చెత్త కాగితాల పై పిచ్చి రాతలు
కాని నా దృష్టిలో కవిత అంటే....
అక్షరాలు అనే ముత్యాలని,
భావం అనే దారాలతో అల్లి,
కవిత అనే అందమైన  హారాన్ని చేసి
,
మన సాహిత్య కళామ్మ తల్లికి సమర్పించడం


08 July 2011

అందం కాదు మనసు ముఖ్యం :)

0 వ్యాఖ్యలు ♥ ツ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

బురదలాంటి దేహము ఉన్ననూ,
దానిలో, వికసించే తమరపువ్వంటి మనసు గ్రహించు నేస్తం!

ఊరించే కల

2 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నా చిన్ని లోకంలో మైమరిచిపోయిన నన్ను
నీ విశాల ప్రపంచంలోకి లాగావు
దాని అందాలన్నీ రుచి చూపించావు,
ఆ ఆనందాన్ని పూర్తిగా అస్వాదించక ముందే,
మధ్యలోనే నువ్వు ఆవిరైపోయి, నన్ను ఒంటరి దాన్ని చేసావు,
నీవు లేక, ఆ అందమైన ప్రపంచం, శూన్యంతో అల్లుకుపోయింది!

తట్టుకోలేనంత ఆనందాన్ని ఒక్కసారిగా క్షణకాలం ఇచ్చి,
ఇప్పుడు ఉండుండి నన్ను దుఃఖ సాగరంలో తోసేసావు

ఇప్పుడు, అలవాటుపడ్డ నీ విశాల ప్రపంచాన్ని వీడలేను
అలాగే తిరిగి నా చిన్ని లోకాన్ని పొందలేను
ఎందుకు ఊరించే కలలా ఎదురయ్యావు?
ఆఖరికి తీరని బాధను మిగిల్చావు

02 July 2011

అమ్మ

0 వ్యాఖ్యలు ♥ ツ



(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
అమ్మ! నువ్వు నన్ను ఇది చెయ్! అది చెయ్! అని విసికించకుండా ఉండని రోజు లేదు
నేను నీ పైన అబ్బ! పో అమ్మ! నా వెంట పడకు!! అని చిరాకు పడని రోజు లేదు
నువ్వు నన్ను తిట్టకుండా ఉండని రోజు లేదు, మనం కోట్లడకుండా ఉండని రోజు లేదు
కాని నీ తిట్లు పొందని రోజు నాకు రోజు కాదు....:'(
మనం ఎప్పటికి శత్రువులమే
కానీ ఆ చిన్ని శత్రుత్వంలో కొండంత మిత్రుత్వం దాగి ఉంది !!

03 June 2011

ఊహల్లో విహరించే హాయి ఎంతో??

2 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

ఊహల్లో విహరించే హాయి ఎంతో,
నా మదిలో రెక్కలు కట్టుకున్న భావాలను అడుగు

వర్షపు తొలి చినుకు

2 వ్యాఖ్యలు ♥ ツ
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

వర్షపు తొలి చినుకు విలువెంతో,
తరచూ ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసే రైతుని అడుగు

నీ ప్రశ్నలు - నా జవాబులు

1 వ్యాఖ్య ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 
తెలుపలేని బాధ బరువెంతో, మూగబోయిన నా మనసుని అడుగు
పట్టించుకోని కన్నీరు విలువెంతో, ఎరుపెక్కిన నా కళ్ళను అడుగు
నెరవేరని కోరికలు మిగిల్చిన నిరాశ ఎంతో, నా మనసుని అల్లుకున్న ఆశలను అడుగు
ప్రేమ నోచుకోని మదిలో భావాల లోతెంతో, రగులుతున్న నా ఒంటరితనాన్ని అడుగు

01 June 2011

నాకు నచ్చిన పాట ~ఇది మల్లెల వేళయనీ

0 వ్యాఖ్యలు ♥ ツ



పల్లవి:
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చరణం:
కసిరే ఎండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరింది
ఎరుగని కోయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది
నెలకు వొరిగింది

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చరణం:
మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
పసి వాడని కుసుమ విలాసం

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చరణం:
ద్వారానికి తారా మణిహారం హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణిహారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేసం లేని సీమలో
మోసం ద్వేసం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

(పాట lyrics ఇక్కడ నుంచి సేకరించాను)

30 May 2011

గాజుబొమ్మ

0 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నా మనసు అనే గాజుబొమ్మను నీలో స్వాధీనం చేసుకున్నావు
దాన్ని ఆడించావు, పాడించావు
పాపం పిచ్చి బొమ్మ!! నీ అడుగులకు మడుగులు వత్తుతూ, ఆడుతూనే ఉంది, పాడుతూనే ఉంది
దానితో ఇంకా నువ్వు ఏమి చేయాలో పాలుపోక, దాన్ని పగలకోట్టేసవు
కొన్నాళ్ళు గడిచింది, ఆ బొమ్మ లేకపోతే నీకు తోచలేదు...
దాన్ని తిరిగి అతికించడానికి ప్రయత్నించావు
తిరిగి దాన్ని బొమ్మగా మార్చావు కానీ, ఆ అతుకులను మాత్రం తొలిగించలేకపోయవు...
ఆ అతుకులు, ఆ బొమ్మకు తగిలిన గాయాలకు, అనుభవించిన వేదనకు నిదర్శనాలు, అవి ఎప్పటికి చేరిగిపోవు

29 May 2011

స్త్రీ జీవితం

0 వ్యాఖ్యలు ♥ ツ

స్త్రీ జీవితం దీపం లాంటిది తాను ఆరిపోయేలోపు ,
తన కన్నీటిని ఇంధనం చేసి తన వాళ్ళ చీకటి జీవితాలలో వెలుగు నింపుతుంది

25 May 2011

అబద్దంలో దాగిన నిజం

9 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

వెలుగుని చూపించే నిజమనే స్వేఛ్చ కన్నా
చీకటితో కమ్ముకుపోయిన అబద్దమనే నిర్భంధనమే నాకు నచ్చింది
ఎందుకంటే...
నేను ఆ అబద్డంలోనే నిజాన్ని చూసాను, చీకటిలో వెలుగుని చూసాను, బాధలోనే హాయిని ఆస్వాదించాను

18 May 2011

అబద్దమనే వల

2 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నిజమనే అలలకు ఎదురు ఈదలేక
అబద్దమనే వలలో చిక్కుకున్నా!!


నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి