skip to main |
skip to sidebar
తేది సమయం
9/29/2013 07:21:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నువ్వు భరించలేని చేదు అనుభవంగా నేను జీవించడం కన్నా,
నీ ఊహల్లో తీపి జ్ఞాపకంగా కరిగిపోవడం మిన్న...
తేది సమయం
5/13/2013 11:03:00 AM
నా మనసు నలుపు తెలుపు రంగులతో కప్పిన ఇంద్రధనస్సు
నీ మనసు కళ్ళకు ప్రేమ కళ్ళజోళ్ళు పెట్టి చూడు
నలుపు తెలుపు పొరలు వీడిన నా మనసు,
అసలైన రంగులతో ఎలా మెరిసేనో చూడు!
తేది సమయం
11/21/2012 03:41:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
కష్టాల మంట నా జీవితాన్ని దహించి
నన్ను ఎడారిగా మార్చిన వేళ
నీ ప్రేమ చల్లని అమృత వర్షమై కురిసి
నా మనసు దాహాన్ని తీర్చింది!
తేది సమయం
11/07/2012 08:25:00 PM
తన మనసులో భావాల రంగులను
గుర్తించిన మరో మనసుకి....
ఈ మనసు ఓ హరివిల్లు!!
తేది సమయం
10/29/2012 11:26:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నా ప్రేమ తాళం చెవి....
నీ మనసు తలుపుని తెరవలేకపోతే.....
నా ప్రేమ రాగం.....
నీ మనసు లోతుని కదిలించకపోతే....
మన మనసులో ఉన్న భావాలు ఎన్నటికి కలవవు
నా గుడ్డి ప్రేమ నీకు కనపడదు...నా మూగ భాష నీకు వినపడదు...
ఆ ప్రేమ....
ఒక్క చెయ్యి చప్పట్ల శబ్దం...
ఆ ప్రేమ....
మూగ పాట నిశ్శబ్దం...
English version: here
తేది సమయం
10/01/2012 03:16:00 PM
నా కళ్ళలో నిన్ను రంగులుగా నింపుకుని, నా మనసులో నీ చిత్రం గీసాను!
తేది సమయం
9/12/2012 09:53:00 AM
మనసులో బాధ కలతతో ఉరిమితే...
కళ్ళలో కన్నీటి వర్షం కురిసెనే!!
తేది సమయం
7/29/2012 10:51:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నా మనసుని నీ ప్రేమతో ఆక్రమించుకున్నావు, మంచిదే!!
కాని...అదే ప్రేమతో పరిపాలించడం మరచిపోకు!!
తేది సమయం
6/29/2012 08:51:00 PM
హృదయంలో ఘనీభవించిన గత వేదన
జ్ఞాపకాల చిరుగాలి తాకి,
కళ్ళలో కన్నీటి ముత్యాలుగా కరిగెనా?!
తేది సమయం
2/11/2012 09:44:00 PM
ఊహలకు అక్షరాలతో ఉపిరి పోస్తే......కవిత...
కలానికి మాటలని నేర్పిస్తే.......కవిత...
కాగితంపై పదాలతో చిత్రం గీస్తే........కవిత...
సృజనాత్మకతతో భావానికి రూపం ఇస్తే......కవిత...
తేది సమయం
10/17/2011 04:20:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నీ ప్రేమతో నా మనసుని ఆక్రమించుకున్నావు
నిన్న 'నేను' అనే నా చిన్న ప్రపంచం,
నీ రాకతో నేడు, 'నువ్వు'గా మారిపోయింది
కాని, ఈ సంతోషం కలకాలం నిలువలేదు
నీ ప్రేమ అబద్ధం అని తెలుసుకున్నాను
ఇప్పుడు, 'నువ్వు' అనే మాయా ప్రపంచం కాలంతో కరిగిపోయింది
చివరికి, నా ప్రపంచం నిర్మానుష్యమైన ఎడారిగా మారిపోయింది
తిరిగి 'నేను' అనే నా అందమైన ప్రపంచానికి నేను చేరువయ్యేదేలా??!!! :'(