ఇంతకు ముందు నిన్ను ప్రేమించేవారు
ఇప్పుడు లేదు!, అన్న చేదు నిజం మరచిపో...
నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...
ప్రేమించమని వెంటపడకు....
బలవంతంగా పుట్టే ప్రేమ, కలకాలం నిలువదు తెలుసుకో...
నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...
కాలం మారుతుంది, కాలం అనుగుణంగా మనుషులు మారుతారు...
ఏది శాశ్వతం కాదు! ఇది జీవిత సత్యం తెలుసుకో...
నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...
9 వ్యాఖ్యలు ♥ ツ
నిజమే ముందు మనల్ని మనం ప్రేమించుకోగలిగితేనే దేన్నైనా లేదా ఎవరినైనా ప్రేమించగలుగుతాం. బాగా చెప్పారు.
బాగా చెప్పారు
బలవంతం మీద, మొహమాటం కొద్ది వచ్చే ప్రేమ బలవంతంగానే మన దగ్గర ఉంటుంది
అన్నిటికి మనం అడగాలి ,మనం చెప్పేదాకా వాళ్లకి మనం ఏమి ఆశిస్తునమో అర్ధం కాదు
మనం ఆశిస్తునట్ట ప్రేమ ఎప్పటికి దొరకదు
మనల్ని మనం ప్రేమిచుకునపుడు ఇది సాద్యం అవుతుంది :)
శ్రీ వల్లి గారు ,
ఈ ప్రపంచం లొ అందరు కూడా వాల్లని వాల్లు ప్రెమించుకునే వాల్లే కదా .లెకపొతే ఇన్ని స్వార్ధాలు ఎందుకు వుంటాయి .ఎదుటి వాల్లను ప్రెమించే వాల్లే కరువయ్యారు.
శ్రీ వల్లి గారు ,
మీరు కణ్ఫ్యుసె
ఈ ప్రపంచం లొ అందరు కూడా వాల్లని వాల్లు ప్రెమించుకునే వాల్లే కదా .లెకపొతే ఇన్ని స్వార్ధాలు ఎందుకు వుంటాయి .ఎదుటి వాల్లను ప్రెమించే వాల్లే కరువయ్యారు.
Subha garu..Thanks andi...
Ravi garu..Thanks andi...
Prasad garu...Thanks andi....me point naku ardam aindi...kani tanani tanu preminchadam swardham kadu ani na abhiprayam.....tananu tanu atiga preminchi...itarulani premichakapovadam swardam avtundi ani na abhiprayam...
మీ బ్లాగు డిజైన్ విభింనంగా వుంది.నిన్ను నీవు తెలుసుకో లాగా నిన్ను నువ్వే ప్రేమించుకో బాగుంది.
కాలం మారింది అని అందరు అంటారు ... కానీ ఉదయం సాయంత్రం , వెన్నెల , ఇలా అన్ని ఎప్పటి లాగానే వున్నాయే ... కాలం మారలేదు ... మన ఆలోచన విధానాలు మారాయీ ....మనల్లి మనం ప్రేమించుకోవడం అనేది అర్ధం లేని మాట అని నా అబిప్రాయం ....అది స్వార్ధం తో కూడుకునది ... మనల్లి మనం ప్రేమిచుకుంటే ఇతరులను పూర్తి స్థాయే లో ..ప్రేమించాలేము అని నా అబిప్రాయం ..... అది మన బ్లడ్ లోనే పుట్టినప్పటి నుంచి వుంటుంది .... మనం చేసే మంచే ఈ భూమి చనిపోయేవరకు శాశ్వతంగా వుంటుంది ... thank you ....
Satya garu.....meeru cheppinadi naku ardam aindi andi....kani na kavitha ki vere konam undi....ikkaada nenu swardhanni encourage cheyadam ledu......E roju ninnu preminche vallu repu ninnu preminchakapovachu....appudu nirasha chendakunda....ne company ni nuvvu enjoy cheyi...ninnu nuvvu preminchukomani cheptunnanu.....vere vallani preminchu preminchu ani...balavantanga vala cheta premincha badina....ala erpadina prema kalakaalam undadu......and....kalam ante...na drushtilo rutuvulu.....rojulu kinda tesukoledu.....ninnu nuvvu preminchuko ante....itarulani preminchaku ani na kavithaku ardam kadu...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ