29 October 2012

ప్రేమించబడని ప్రేమ...


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నా ప్రేమ తాళం చెవి....
నీ మనసు తలుపుని తెరవలేకపోతే.....
నా ప్రేమ రాగం.....
నీ మనసు లోతుని కదిలించకపోతే....

మన మనసులో ఉన్న భావాలు ఎన్నటికి కలవవు
నా గుడ్డి ప్రేమ నీకు కనపడదు...నా మూగ భాష నీకు వినపడదు...

ఆ  ప్రేమ....
ఒక్క చెయ్యి చప్పట్ల శబ్దం...
ఆ  ప్రేమ....
మూగ పాట నిశ్శబ్దం...

English version: here

6 వ్యాఖ్యలు ♥ ツ

Padmarpita చెప్పారు....

నాకు నచ్చింది:-)

Unknown చెప్పారు....

ప్రేమ అలా మూగబోతే ఎలాగండీ?
వినబడని హృదయానిదా దురదృష్టం....

Kalyan చెప్పారు....

అద్బుతం !

vallikala padhala allika చెప్పారు....

కన్నుల్లో అక్షరాల నింపుకుని నిడురిస్తావో

కలలో అక్షరాలను కలవరిస్తావో

నీ మనసులో మెదిలే ప్రతి అక్షరం మురిసిపోతుంది

నీ హృదయలయలో మౌన సవ్వడి.. అక్షరాలుగా బావాన్ని పలికిస్తూ

బాషే తెలియని మది హోయలికి మాటలు నేర్పిస్తాయి...)

ఆ అక్షరాల విలువ తెలిసిన మనసుకే నీ ముగా బాష వినిపిస్తుంది :)

Gunda చెప్పారు....

Super post

Sri Valli చెప్పారు....

పద్మర్పిత, చిన్ని ఆశ , కళ్యాణ్, vallikala padhala allika, మల్లికార్జున్
ధన్యవాదాలండి :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి