Showing posts with label కొన్ని అందమైన కలలు నెరవేరడం అసాధ్యం.... కాని..... Show all posts
Showing posts with label కొన్ని అందమైన కలలు నెరవేరడం అసాధ్యం.... కాని..... Show all posts

26 September 2011

కొన్ని అందమైన కలలు నెరవేరడం అసాధ్యం!!.... కాని....

5 వ్యాఖ్యలు ♥ ツ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 

తారలను నా దోసిలిలో నింపుకోలేను!!
కాని,
తళ తళలాడే దాని మెరుపుని నా కళ్ళలో బంధించాను

ఎంత ఎగిరినా మేఘాలను తాకలేను!!
కానీ,
అవి చల్లగా కరిగినపుడు, కురిసిన వాన చినుకులని ఆస్వాదించాను

హరివిల్లు నుండి జివ్వున జారలేను !!
కాని,
దాని రంగులు నా కలలకు అద్దాను

సీతాకోకచిలకలా స్వేచ్చగా ఎగరలేను!!
కాని,
దాని రెక్కలు నా ఊహలకు ఇచ్చాను

దూరంగా ఉన్న నిన్ను చేరలేను!!
కాని,
పదిలపరుచుకున్ననీ జ్ఞాపకాలతో, నిన్ను నాకు చేరువగా చేసుకున్నాను


నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి