12 September 2012

కన్నీటి వర్షం

6 వ్యాఖ్యలు ♥ ツ


మనసులో బాధ కలతతో
ఉరిమితే...
కళ్ళలో కన్నీటి వర్షం కురిసెనే!!

29 July 2012

మరచిపోకు!

3 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నా మనసుని నీ ప్రేమతో ఆక్రమించుకున్నావు, మంచిదే!!
కాని...అదే ప్రేమతో పరిపాలించడం మరచిపోకు!!

29 June 2012

కన్నీటి ముత్యాలు

10 వ్యాఖ్యలు ♥ ツ

హృదయంలో ఘనీభవించిన గత వేదన
జ్ఞాపకాల చిరుగాలి తాకి,
కళ్ళలో కన్నీటి ముత్యాలుగా కరిగెనా?!

02 June 2012

దగ్గర....దూరం

6 వ్యాఖ్యలు ♥ ツ
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నీకు దగ్గరై దూరం ఐయ్యెకంటే...దూరమై దగ్గర కావాలనుకున్నాను...

28 May 2012

స్వేచ్ఛ వచ్చింది ...కాని, ఎం లాభం ?

8 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

ఎగరాలని ప్రయత్నిస్తున్న రంగుల చిట్టి చిలకని
బంగారు పంజరంలో నిర్భందించావు
దాని ఆకలి తీర్చావు, దాహం తీర్చావు
కాని, అది కొరుకుంటున్న స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు
పాపం చిట్టి చిలక...అది ఉన్న పరిధిలోనే ఎగురుతూ...
తనకు స్వేచ్ఛ వచ్చేది ఎప్పుడా అని తెగ ఆరాటపడేది

కొన్నాళ్ళు గడిచింది...

చిట్టి చిలక అందం క్షీణించింది
రంగులతో నిండిన చిలుక, రంగులు లేకుండా పోయింది
ఇప్పుడు, ఆ చిలక నీకు భారం అయిపోయింది...
చివరికి...దాన్ని వదిలేసావ్...

కాని ఎం లాభం??...

ఇప్పుడు అది రెక్కలున్నా ఎగరలేదు

కోరుకున్న స్వేచ్ఛ దరిచేరినా ....అనుభవించలేదు!!

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి