ఎగరాలని ప్రయత్నిస్తున్న రంగుల చిట్టి చిలకని
బంగారు పంజరంలో నిర్భందించావు
దాని ఆకలి తీర్చావు, దాహం తీర్చావు
కాని, అది కొరుకుంటున్న స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు
పాపం చిట్టి చిలక...అది ఉన్న పరిధిలోనే ఎగురుతూ...
తనకు స్వేచ్ఛ వచ్చేది ఎప్పుడా అని తెగ ఆరాటపడేది
కొన్నాళ్ళు గడిచింది...
చిట్టి చిలక అందం క్షీణించింది
రంగులతో నిండిన చిలుక, రంగులు లేకుండా పోయింది
ఇప్పుడు, ఆ చిలక నీకు భారం అయిపోయింది...
చివరికి...దాన్ని వదిలేసావ్...
ఇంతకు ముందు నిన్ను ప్రేమించేవారు
ఇప్పుడు లేదు!, అన్న చేదు నిజం మరచిపో...
నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...
ప్రేమించమని వెంటపడకు....
బలవంతంగా పుట్టే ప్రేమ, కలకాలం నిలువదు తెలుసుకో...
నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...
కాలం మారుతుంది, కాలం అనుగుణంగా మనుషులు మారుతారు...
ఏది శాశ్వతం కాదు! ఇది జీవిత సత్యం తెలుసుకో...
నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...
"కనిపించేవన్నీ నిజాలు కావు ,కనిపించనివన్నీ అబద్ధాలు కావు....
కొన్ని నిజాలు కాలం అనే తెర వెనుక దాగి ఉంటాయి
కాలం కరిగినపుడు, కనిపించని ఆ నిజాలు బయటకి వస్తాయి!!"
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
రెక్కలను గాయపరుస్తూ, బలవంతంగా మొగ్గని పువ్వు చేస్తీ...
ఉండునా ఆ పువ్వుకి సహజమైన అందం ?
"నన్ను ప్రేమించు!!" అని నేను అర్ధిస్తే, జాలితో నువ్వు నన్ను ప్రేమిస్తే నిలుచునా కలకాలం అలా ఏర్పడిన మన ప్రేమ బంధం ?
ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి