29 November 2011

మనసుకి కళ్ళు ఉంటే...



(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 
ఆకాశాన చంద్రుడి అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, చంద్రుడి చుట్టూ ఉండి, దాని అందాన్ని మెరుగుపరిచే కోటి చుక్కలని పట్టించుకోము
వికసించిన గులాబీ పువ్వు అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, ఆ పువ్వుని కాపాడే ముళ్ళని పట్టించుకోము
ఆకాశాన్ని ఏడు రంగులతో కప్పే ఇంద్రధనస్సు చూసి మైమరచిపోతాము
కాని, ఆ అందానికి కారణమైన ఎండా, వానల కలయికన్న విషయాన్నీ పట్టించుకోము
వాన చినుకులని దోసిలిలో నింపుకుని, పైకి ఎగరేస్తూ, వాటితో ఆడుకుంటూ మైమరచిపోతాము
కాని, ఆ చినుకులని మొస్తూ కుడా హాయిగా, స్వేచ్చగా విహరించే మబ్బులను పట్టించుకోము
ఎక్కడినుంచో ఎగిరి వచ్చి చెట్టుపై వాలిన నెమలి అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, దానికి చల్లని నిడనిచ్చే చెట్టుని పట్టించుకోము
రంగుల రెక్కలతో ఎగిరే సీతకోకచిలక అందాన్ని చూసి మైమరచిపోతము
కాని తన ఈ కొత్త రూపం, గొంగళి పడిన కృషికి నిదర్శనము అన్న విషయాన్ని పట్టించుకోము
ప్రకృతిలో ప్రతి అందాన్ని చూసి మైమరచిపోతము
కాని, ఆ అందానికి కారణమైన మరో అందాన్ని మాత్రం మరచిపోతాము
ప్రతి సాధారణమైన విషయంలో, ఓ అద్భుతం దాగి ఉంది
సౌందర్యం కళ్ళని ఆకర్షిస్తుంది, కాని, ఆత్మసౌందర్యం మనసుని ఆకర్షిస్తుంది!
ఈ విశాల ప్రపంచాన్ని కళ్ళతోనే కాకుండా మనసుతో కూడా పరిశీలించు నేస్తం!!

7 వ్యాఖ్యలు ♥ ツ

రసజ్ఞ చెప్పారు....

గాలిపటం పైకి ఎగురుతున్న క్రొద్దీ ఆనందిస్తాము కాని దానికి ఆధారమయిన దారాన్ని గమనించం. బాగుంది వల్లీ గారూ చాలా చక్కగా చెప్పారు! అంతః సౌందర్యాన్ని గుర్తిస్తే ప్రపంచమంతా ఆనందమయమే!

Unknown చెప్పారు....

ఆత్మ సౌందర్యం మనసుని ఆకర్షిస్తుంది...సత్యం
ఇది అనుభవపూరకంగా పొందితేనే కానీ అర్ధం కాని విషయం, బాహ్య సౌందర్యమే సౌందర్యం అనిపించే వయసు దాటాకా మనసుతో చూడగలిగేది ఆత్మ సౌందర్యం.

Gowardhan చెప్పారు....

కనులు చూసె అందాల వెనుక
మనసు పలికే భావాలున్నవి

ఈ ప్రక్రుతి లొ ప్రతి అందానికి
కమ్మనైన బందం వుంది

ముల్లు లేని గులాబీ వ్యర్దమె
మనసు లేని అందానికి లెదు అర్దమె

మీ కవిత నన్ను కదిలించంది

www.pulakintha.in
www.readitt (the e magazine)

Sri Valli చెప్పారు....

Chadivi me abhiprayalu teliyachesinanduku dhanyavadalu Rasagna garu, Chitti garu :)

Kalyan చెప్పారు....
This comment has been removed by the author.
Kalyan చెప్పారు....

@వల్లి లోనున్న ఆత్మను అనుకరిస్తే అన్నీ అనువైనవే అని ఎంతో చక్కగా విన్నవించారు వల్లి గారు.... మీ పదాలు బాగున్నాయి వాటికి కారణమైన మంచి మనసు బాగుంది...

Sri Valli చెప్పారు....

Kalyan garu thanks andi :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి