(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
అమ్మా!!
నీకు నేను భారమా??
ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా ?
చెత్తకుండియే నాకు స్థానమా?
పేదింటి తల్లి "నిన్ను పోషించలేమమ్మ!!" అని వదిలేస్తుంది
మధ్యతరగతింటి తల్లి "నువ్వు ఓ ఇంటి దానివయ్యాక, మమ్మల్ని ఎవరు చూస్తారమ్మ!!" అని వదిలేస్తుంది
గొప్పింటి తల్లి "మాకు వంశోద్ధారకుడు కావాలమ్మ!!" అని వదిలేస్తుంది
అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం అంటారు కదమ్మా !!
ఎక్కడ ఉందమ్మా సమానత్వం?
ఓ నాటి ఆడపిల్లకే, ఆడపిల్ల అంటే ఇంత చీదరింపు ఎందుకమ్మా ??
మంచికి, చెడుకి తేడా తెలియని ఈ లేత మనసుకి,
నీ కఠిన హృదయం చవి చూపించావా?
కళ్ళే తెరువని ఈ పసి పాప భవిష్యత్తుకి
కన్నీరే మిగిల్చావా?
నవమాసాలు మోసి,
నా దేహానికి ప్రాణం పొసి,
నీలోనే నన్ను వెలికి తీసి,
చివరికి, నన్ను వదిలేసి,
'అమ్మ' అనే పదానికి అర్ధం లేకుండా ఎందుకు చేశావమ్మ??
7 వ్యాఖ్యలు ♥ ツ
ఆడ జన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో ?....
నైస్ ఫీల్,
ఇంత modern టైం లో కూడా ఇలాంటివి చూస్తుండటం నిజంగా శోచనీయం !!
?!
I can't understand the language u've used. :(
చక్కగా వ్రాశారు! కంటే కుతురినే కనాలి మనసుంటే మగాడిలా పెంచాలి అంటారు కానీ ఎంతమంది పాటిస్తారు? అన్నీ కేవలం బోధనలకేనా?
బాలల దినోత్సవ వేడుకల్లో బాలబాలికలు వినోదంలోమినిగి తేలుతుంటే, పాపం ఈ అనాధ బాలిక ఆకలితో చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. పేదలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ఇలాంటి అనాధ బాలబాలికలు కనిపించకపోవడం శోచనీయం.
akka chaala baagundhi
chala bagumdi.... mi blog la chala amdamga vumdi
Enduko emo, blogillu, rasagna , kaayala naagendra, Keerthana, Hanu
Me abhiprayalu teliya chesinanduku dhanyavadalu :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ